ఆదర్శ కుటుంబం ( AK 47) : ఇంటర్వల్ దాకా డేంజరస్ కుటుంబం. ఇంటర్వల్ తర్వాత, ఇది ఏమి కుటుంబం?

త్రివిక్రమ్ సినిమా , బాలేకపోయినా చూసే వారు ఉంటారు.. మాటల మాంత్రికుడు అనే టాగ్ బలమో, లేక గురూజీ అన్ని బాగా వివరిస్తారు అనే ప్రాచుర్య బలమో తెలీదు కానీ, త్రివిక్రమ్ సినిమాలు థియేటర్ లో కన్నా, టీవీ స్క్రీన్ లో ఎక్కువ ఆడుతాయి. అతని రీసెంట్ గుంటూరు కారం కూడా, ఫ్యాన్స్ ను మెప్పించకపాయిన, టీవీ స్క్రీన్స్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగానే కనెక్ట్ అయ్యింది. ఇక ఫ్యామిలీస్ అనగానే, ముందు గుర్తు వచ్చే హీరో, విక్టరీ వెంకటేష్… ప్రమోషనల్ కాంటెంట్ పెద్దగా ఆకట్టుకోకపోయినా… విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ ల సినిమా అనగానే, అటు ఫ్యామిలీ నుంచి ఫ్యాన్స్ దాకా, , సినిమా చూడటానికి ఆసక్తి చూపించారు… మరి సినిమా ఎలా ఉందో… చూద్దాం. !

త్రివిక్రమ్ VS అనిల్ రావిపూడి

S/O సత్యమూర్తి లో, విలువలే ఆస్తి అంటూ… ధనిక కుటుంబం నుంచి పేదరికం అంచులకి వెళ్లిన ఒక కుర్రవాడి కథను.. డబ్బు కన్నా ఆలోచనే గొప్పది అని చెప్పిన అతనే… ఆదర్శ కుటుంబం అంటూ… ఆలోచన, విలువలు కన్నా, డబ్బు గొప్పది అంటూ.. మిడిల్ క్లాస్ ఒక శాపం అనిపించేలా వ్రాశాడు…

ఈ తరం.. GEN Z కు, త్రివిక్రమ్ ను ఆదర్శంగా తీసుకోండి అని చెప్పలేని పరిస్థితి. ఏమైనా అంటే, అనిల్ రావిపూడి కూడా ఇలానే తీస్తాడు కదా.. ఏముంది గొప్ప అనే మటాలు వినిపించే అవకాశము లేకపోలేదు..

హిట్టు కళ : ఫస్ట్ హాఫ్ !

ఈ సినిమాలో, ఐడియా ఇది వరకు వచ్చిన ఒక తమిళ్ సినిమా తో పోలి ఉన్నా, మాతృక ఇంగ్లీష్ సినిమా కావడంతో.. ఇది ముందు వాళ్ళది, తర్వాత మనది అనలేము.. కానీ.. ఐడియా ను ఎంత వరకు మార్పులు చేసి, బయటికి అమ్ముతున్నారు అనేదే ఇంపార్టెంట్. త్రివిక్రమ్ శ్రీనివాస్ లోని రచయిత.. మొదటి గంట తన వింటేజ్ స్టైల్ ఆఫ్ ప్రాశలు తో అలరిస్తే, వెంకటేష్ తనకి బాగా అలవాటైన గ్రౌండ్ అండ్ GENRE కావడంతో … సినిమాని ఇంటర్వల్ దాకా ఏదో హిట్ సినిమా చూస్తున్నట్టు భావన కలిపిస్తారు..

సినిమా ఇంటర్వల్ లో, పాత్రలు డేంజరస్ గా మారడం, ఆ transformation కు థమన్ మ్యూజిక్ జత కలిపి, మొదటి సగం అయ్యేసరికి, త్రివిక్రమ్ వింటేజ్ ఫ్యాన్స్ నుంచి కొత్త తరం దాకా , మంచి సినిమా చూడబోతున్నాం అని రెండవ సగం కోసం ఎదురు చూడటం మొదలు పెడుతారు…. కానీ……

ఇది త్రివిక్రమ్ సినిమా ఆ!?

సెకండ్ హాఫ్. సినిమాని ఆమాంతం కిందకి పడేసిన సగం…. త్రివిక్రమ్ ను అనిల్ రావిపూడి ని ఎందుకు కంపేర్ చేశానో, ఈ సినిమా రెండవ సగం చూస్తే అర్దం అయిపోతుంది.. అర్దం పర్థం లేని సీన్లు… ఆకట్టుకొని డ్రామా… దీనికి తోడు… నాసిరకపు ఫ్లాష్ బాక్…. ఎదో గుడ్డ ముక్క టైట్ అయితే, అతికినట్టు.. ఏవేవో సీన్లు వస్తుంటాయి… ప్రాసలు వినబడవు… మొదటి సగం లో చూసిన హీరోయిజం కనబడదు…. పోనీ క్లైమాక్స్ లో త్రివిక్రమ్ తరహా ఎండింగ్ ఉంటుంది అనుకుంటే, ఇదంతా నేచర్ పని… మనం చేసింది ఏమి లేదు అనట్టు… BUTTERFLY EFFECT ను సమర్ధించే రాత.

అతని పాత్రలు కి చదువు లేదు కాబట్టి, రచయిత కూడా చదువు , విలువలు లేని వాడిలా అనుకరించాడా? లేక రచయిత కు మంచి బోర్ కొట్టేసి, బుర్ర కి పని చెప్పడం మానేసాడా? ఏదైనా… టీవీ స్క్రీన్స్ లో కూడా, సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు… స్కిప్ చేసేస్తాడు ప్రేక్షకుడు.

I would rate the film with 2/5

I liked the first half and the interval. The second half should be ” shift + Deleted”. that’s all.

Rate this Article 🙂

Leave a Comment